News March 25, 2024
విస్తృతంగా ఓటరు చైతన్య అవగాహన కార్యక్రమాలు

జిల్లాలో 2019లో 79.77 ఓటింగ్ శాతం నమోదైందని, అంతకంటే ఓటింగ్ శాతం పెంచడం, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని చైతన్య పరచడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. ఇప్పటికే ఈవీఎంలపై అవగాహన కల్పించామని, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News January 21, 2026
తిరుమలలో ఆ దర్శనాలన్నీ రద్దు

రథసప్తమి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పలు దర్శన సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఎన్‌ఆర్‌ఐ, చంటి బిడ్డలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు.
News January 21, 2026
నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై సంబంధిత శాఖ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని జిల్లాలో పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న స్కానింగ్ సెంటర్ల విషయంలో దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని సూచించారు.
News January 21, 2026
నెల్లూరులో ఎర్రబంగారం పట్టుబడేది కొంచెమేనా..?

నెల్లూరు జిల్లాలో అపారమైన ఎర్ర చందనం ఉంది. అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఎర్ర బంగారాన్ని జిల్లా దాటిచేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. 2022 నుంచి 2025 వరకు 29,851 కేజీల దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.2.78 కోట్లగా ఉంది. తాజాగా ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఏది ఏమైనప్పటికీ పట్టుబడిన ఎర్రచందనం కంటే ఐదారు రెట్లు దేశం దాటిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.


