News March 22, 2025

6గ్యారంటీలకు రూ.56 వేల కోట్లు: Dy.CM

image

BRS పాలనలో రాష్ట్ర GST వృద్ధి రేటు 8.54 శాతంగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది 12.3 శాతానికి పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆరు గ్యారంటీల కోసం మాత్రమే రూ.56 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, బడ్జెట్‌ను సవరించి, నిజమైన లెక్కలనే ప్రజలకు వెల్లడించామన్నారు.

Similar News

News March 23, 2025

ఖమ్మం: ఆడబిడ్డ పుడితే స్వీట్లతో శుభాకాంక్షలు

image

జిల్లాలో ఆడపిల్ల పుట్టిన ఇంటికి అధికారులు వెళ్లి మిఠాయి బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలపాలని, ‘గర్ల్ ప్రైడ్’ పేరిట ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమ్మాయి పుట్టడం శుభ సూచకమనే ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇటీవల దివ్యాంగులకు కలెక్టరేట్లో ఉచిత భోజనం వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్‌ను అభినందిస్తున్నారు.

News March 23, 2025

ఖమ్మం: రెండో రోజు 34 మంది విద్యార్థుల గైర్హాజరు

image

ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం పదో తరగతి హిందీ పరీక్షకు 34మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ తెలిపారు. మొత్తం 16,386 మంది విద్యార్థులకు గాను 16,352మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. ఎనిమిది పరీక్ష కేంద్రాలను డీఈవో, 37 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.

News March 23, 2025

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

image

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) కేజీ రూ. 185 ఉండగా, స్కిన్ లెస్ కేజీ రూ.210 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 130 మధ్య ఉంది. కాగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.

error: Content is protected !!