News March 22, 2025
IPL: తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు

ఇవాళ KKR-RCB మధ్య జరిగే IPL తొలి మ్యాచ్‌కు 80% వర్షం ముప్పు పొంచి ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వద్ద నిన్న సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కూ ఆటంకం ఏర్పడింది. శని, ఆదివారాల్లో నగరంలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని కోల్‌కతా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇవాళ మ్యాచ్ జరుగుతుందో లేదోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Similar News
News February 8, 2026
ఏగిలిచేస్తే ఏలనివానికైనా పండుతుంది

ఏగిలి చేయడం అంటే పొలాన్ని బాగా దున్నడం, చదును లేదా దమ్ము చేయడం అని అర్థం. ఏలనివానికైనా అంటే ఏమీ తెలియని వాడని అర్థం. సాగు చేయాలనుకునే నేలను బాగా చదును చేసి, దున్ని సరైన సమయంలో విత్తనం వేస్తే, వ్యవసాయం గురించి పెద్దగా అనుభవం లేని వారికైనా సరే పంట బాగా పండుతుంది. అంటే మన కష్టం మరియు నేల సత్తువ మీదే పంట దిగుబడి, ఆదాయం ఆధారపడి ఉంటుందని ఈ సామెత అంతరార్థం.
News February 8, 2026
భాను వ్రతం ఆచరిస్తే.. పాటించాల్సిన నియమాలు

సూర్య వ్రతం ఆచరించే వారు సూర్యోదయానికి మేల్కొని, పవిత్ర స్నానం ఆచరించి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తెలుపు/ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజా గదిలో సూర్య యంత్రాన్ని, పటాన్ని ఉంచి, ఎర్రటి పూలు, గంధంతో అర్చించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు పండ్లు లేదా ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా స్వీకరించి వ్రతాన్ని ముగించాలి. దీనివల్ల ఆరోగ్యం, తేజస్సు సిద్ధిస్తాయి.
News February 8, 2026
కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన సూర్య కుమార్

T20Iల్లో సూర్య కుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. టీమ్ ఇండియా తరఫున అత్యధిక POTMలు నెగ్గిన ప్లేయర్‌గా నిలిచారు. నిన్నటి మ్యాచులో POTM రావడంతో ఆయన ఖాతాలో అవార్డుల సంఖ్య 17కు చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ(16), రోహిత్ శర్మ(14), అక్షర్ పటేల్(8) ఉన్నారు. T20I WCలో భారత్ తరఫున అత్యధిక POTMలు గెలిచిన జాబితాలో కోహ్లీ(8), సూర్య(4), యువరాజ్(3), అశ్విన్(3), రోహిత్(3) ఉన్నారు.


