News March 22, 2025

కరీంనగర్: వరుసగా మృతదేహాలు లభ్యం

image

ఉమ్మడిKNR జిల్లావ్యాప్తంగా వరుసగా మృతదేహాలు లభ్యమవుతున్నాయి. గురువారం KNR జిల్లా చిగురుమామిడి(M) ఇందుర్తికి చెందిన అందే మల్లవ్వ అనే వృద్ధురాలి మృతదేహం తిమ్మాపూర్ LMD జలాశయం వద్ద లభ్యంకాగా, KNRలోని NTR విగ్రహం సమీపంలోని నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. వేములవాడ(M)అగ్రహారంలో గుర్తుతెలియని <<15824324>>మగ<<>> మృతదేహం కనిపించింది. నిన్న HZB(M)తుమ్మనపల్లి SRSPకెనాల్‌లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.

Similar News

News November 12, 2025

RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్!

image

బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో RCB సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది హోమ్ మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో ఆడొద్దని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకు బదులుగా మహారాష్ట్రలోని పుణే స్టేడియాన్ని ఎంచుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే RCB తమ మ్యాచులను హోమ్ గ్రౌండ్‌లో ఆడకపోవడం ఇదే తొలిసారి కానుంది. అటు సొంత టీమ్ అభిమానులకు నిరాశే మిగలనుంది.

News November 12, 2025

కోనసీమ: టెన్త్ విద్యార్థులకు alert..షెడ్యూల్ విడుదల

image

2025-26 విద్యాసంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైనట్లు డీఈవో సలీంబాషా తెలిపారు. రెగ్యులర్, ఫెయిల్ అయిన వారు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 13 – 25 వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 3 వరకు చెల్లించవచ్చన్నారు.

News November 12, 2025

APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<>CCRAS<<>>) 5 కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 21న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. BAMS, MD, MS(ఆయుర్వేదం), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. https://ccras.nic.in/