News March 22, 2025

ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నల్గొండ అమ్మాయి మృతి

image

రోడ్డుప్రమాదంలో నల్గొండకు చెందిన యువతి మృతిచెందిన ఘటన తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలిలా.. HYDలో MBBS చేస్తున్న తన చెల్లిని తీసుకురావడానికి నల్గొండ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ORRపై కారు టైర్ పగలడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే యువతి చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు నల్గొండలోని మీర్ బాగ్, రహమాన్ బాగ్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Similar News

News March 1, 2026

నల్గొండ: ఉచిత బ్యూటీషియన్ కోర్సు.. దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మార్చి 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ కోర్సుకు 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు తమ విద్యా అర్హత పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ప్రాంగణంలో సంప్రదించాలని మేనేజర్ అనిత తెలిపారు.

News March 1, 2026

NLG: సెగలు పుట్టిస్తున్న భానుడు

image

నల్గొండ జిల్లాలో ఈ ఏడాది వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. సాధారణంగా మార్చిలో ఉండే ఎండలు ఫిబ్రవరి చివరి వారంలోనే కనిపిస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 1, 2026

దేవాలయాల పాలకవర్గాలకు నోటిఫికేషన్

image

దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న NKP, CTL మండలాల్లోని పలు దేవాలయాలకు పాలకవర్గాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించారు. NKP మండలంలో NKP ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, రామలింగేశ్వరస్వామి, ఎం.ఎడవెల్లిలోని హనుమాన్, షాపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి, మాండ్రలోని శ్రీ ఆంజనేయస్వామి CTL మండలం పేరుపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయ పాలకవర్గాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది.