News March 22, 2025
బాపట్ల: పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్.!

మూత్రవిసర్జన ముసుగులో రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కొత్తపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. బాపట్ల ఎస్కార్ట్ పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఖైదీని చెరుకుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జైలు నుంచి తెనాలి కోర్టులో హాజరుపర్చారు. తిరుగు ప్రయాణంలో గుంటూరు బస్టాండ్‌లో మూత్రవిసర్జన కోసం వెళ్లి ఖైదీ తిరిగి రాలేదు. దీంతో కొత్తపేటలో ఫిర్యాదు చేశారు.
Similar News
News March 23, 2025
విశాఖలో రేపే మ్యాచ్..

దేశంలో IPL ఫీవర్ స్టార్ట్ అయింది. శనివారం నుంచి మ్యాచ్‌లు మొదలు కాగా క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. కాగా ఈ ఏడాది విశాఖ 2 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం విశాఖలో జరిగే ఢిల్లీ- లక్నో మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ACA తెలిపింది. రేపు సాయంత్రం 6.30 నుంచి మెగా సెలబ్రేషన్స్‌తో విశాఖలో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News March 23, 2025
బెట్టింగ్ యాప్.. ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌పై ఫిర్యాదు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేస్తున్నారంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌లపై హైదరాబాద్ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఓ బెట్టింగ్ యాప్‌కు వీరు ముగ్గురు ప్రమోషన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకున్నారని ఆరోపించారు. కాగా ఇటీవల దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండపై కూడా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.
News March 23, 2025
సూర్యాపేట: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని కుంటపల్లి గ్రామ శివారులో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. మృతుడి పేరు యాకుబ్ కాగా అతనిది ఏపీ రాష్ట్రమని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.