News March 22, 2025
ఆరో తరం ఫైటర్ జెట్‌పై అమెరికా చూపు

ఓవైపు ప్రపంచదేశాలు ఐదో తరం ఫైటర్ జెట్ గురించి ఆలోచిస్తుంటే అమెరికా ఆరో తరంపై దృష్టి సారించింది. అత్యాధునిక యుద్ధవిమానాన్ని రూపొందించే బాధ్యతను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ బోయింగ్‌కు అప్పగించారు. ‘ప్రపంచంలో మరే విమానం కూడా దరిదాపుల్లోకి రాని విధంగా మా ఫైటర్ జెట్ ఉంటుంది. దాన్ని ఎఫ్-47గా పిలుస్తున్నాం. ఇప్పటికే ఐదేళ్లుగా దాని ప్రయోగాత్మక వెర్షన్‌ను రహస్యంగా పరీక్షిస్తున్నాం’ అని వెల్లడించారు.
Similar News
News March 23, 2025
బెట్టింగ్ యాప్.. ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌పై ఫిర్యాదు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేస్తున్నారంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌లపై హైదరాబాద్ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఓ బెట్టింగ్ యాప్‌కు వీరు ముగ్గురు ప్రమోషన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకున్నారని ఆరోపించారు. కాగా ఇటీవల దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండపై కూడా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.
News March 23, 2025
LSGలోకి స్టార్ ఆల్‌రౌండర్ ఎంట్రీ

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. అతడి బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. గాయం కారణంగా IPL నుంచి తప్పుకున్న మొహ్సిన్ ఖాన్ స్థానంలో అతడిని తీసుకుంది. త్వరలో ఆయన జట్టుతో చేరనున్నారు. కాగా గతంలో శార్దూల్ ఠాకూర్ CSK, PBKS, KKR, DC, RPS జట్లకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 95 మ్యాచులాడి 94 వికెట్లు, 307 పరుగులు చేశారు.
News March 23, 2025
డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కిషన్ రెడ్డి

TG: దేశంలో లేని సమస్యను సృష్టించి, బీజేపీకి వ్యతిరేకంగా నిన్న చెన్నైలో డీలిమిటేషన్‌పై సమావేశం నిర్వహించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి పనిచేస్తోందని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. నిన్నటి సమావేశంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాత బంధం బయటపడిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.