News March 22, 2025

పెద్దపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు యువకుడు బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌‌లకు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి(D) మంథని(M) విలోచవరానికు చెందిన కొరవేన సాయితేజ(26) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని KNRలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లో దశలవారీగా రూ.10లక్షలు పోగొట్టుకున్నాడని, అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 18న ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని పేర్కొన్నారు.

Similar News

News September 17, 2025

అనంత నుంచి అమరావతికి 45 బస్సులు.. 2,100 మంది సిద్ధం

image

అనంతపురం జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈనెల 19న అమరావతిలో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు జిల్లా నుంచి 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అందులో వారి కుటుంబ సభ్యులు, విద్యాశాఖ అధికారులు.. మొత్తం 2,100 అమరావతికి వెళ్లనున్నట్లు తెలిపారు.

News September 17, 2025

ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల ఆధారంగా ప‌నితీరు ఉండాలి: లక్ష్మీశా

image

ప్ర‌జా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల ఆధారంగా అధికారులు తమ ప‌నితీరును మెరుగుప‌రుచుకోవాలని క‌లెక్ట‌ర్ లక్ష్మీశా అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని వీడియో కాన్ఫ‌రెన్స్ హాల్ నుంచి ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల ఆదాయాలను పెంచడానికి దోహదపడే ఉద్యానవన, పశుసంవర్థక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News September 17, 2025

సద్దుల బతుకమ్మ-దసరా వేడుకలపై మంత్రి కొండా సమీక్ష

image

వరంగల్‌లో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ-దసరా వేడుకలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. రంగలీల మైదానంలో జరుగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై మేయర్, పోలీస్ కమిషనర్, బల్దియా కమిషనర్‌తో ఆమె చర్చించారు. వేడుకలను ఘనంగా, సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకలు ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.