News March 22, 2025

సంతబొమ్మాళి యువకుడికి రూ.1.3 కోట్ల కొలువు

image

సంతబొమ్మాళి మండలం ఉద్దండపాలెంకు చెందిన హనుమంతు సింహాచలంకు పోలాండ్ దేశంలో రూ.1.3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది. విశాఖలో MHRM విద్య పూర్తిచేసిన యువకుడు పోలాండ్‌లో ఒక డైరీ సంస్థలో HR Assistant గా ఎంపికయ్యారు. ఈ మేరకు యువకుడిని గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. యువకుడు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు.

Similar News

News March 23, 2025

ఎచ్చెర్ల రోడ్డు ప్రమాదంలో టెక్నీషియన్ మృతి

image

ఎచ్చెర్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన దేశరాజ వెంకట కిరణ్ కుమార్(40) ఆదివారం ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ వద్ద జంక్షన్ దాటుతుండగా రాజాం నుంచి వస్తున్న క్యాబ్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎచ్చెర్ల‌లో రూమ్ తీసుకొని రణస్థలం ప్రభుత్వాసుపత్రి CHCలో టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

News March 23, 2025

ఎచ్చెర్ల: ఆరుగురిపై క్రిమినల్ కేసులు

image

కుప్పిలి ఆదర్శ పాఠశాల విద్యార్థుల మాస్ కాపీయింగ్‌కు ఉపాధ్యాయులు సహకరించారని శ్రీకాకుళం డీఈఓ తిరుమల చైతన్య ఎచ్చెర్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆరుగురు ఉపాధ్యాయులతోపాటు మరికొందరి పాత్ర ఉందని డీఈఓ ఫిర్యాదు చేయగా ఎఫ్ఎఆర్‌లో వారి పేర్లు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. సందీప్ కుమార్ చెప్పారు.

News March 23, 2025

ఎచ్చెర్ల: టెన్త్ చూచిరాతలో సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

image

ఎచ్చెర్ల మండలం కుప్పిలి ఏపీ మోడల్ హైస్కూల్ ఏ, బీ కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల్లో చూచిరాతల్లో సీనియర్ అసిస్టెంట్ కిషోర్‌ను జిల్లా విద్యాశాఖధికారి తిరుమల చైతన్య సస్పెండ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 21న స్థానికులు ఫిర్యాదు మేరకు 14 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన సంఘటన “Way2News” లో వెలువడిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!