News March 22, 2025

MBNR: నేటి నుంచి ఐపీఎల్ షురూ.. జర జాగ్రత్త గురూ!

image

ఐపీఎల్ అంటేనే ఏమా క్రేజ్. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ పై బెట్టింగ్ పెడుతూ యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతేడాది పలువురు బెట్టింగ్ రాయుళ్లపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ పై మోజు పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.బెట్టింగ్ అని వచ్చే వారితో యువత జాగ్రత్తగా ఉండాలని, సమాచారం ఇవ్వాలన్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News March 24, 2025

వెంకటాపురం: లారీ ఢీకొని ఒకరు మృతి

image

వెంకటాపురంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఉప్పెడు వీరాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు వీరాపురం గ్రామానికి చెందిన గోపాల్‌గా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News March 24, 2025

ర్యాగింగ్ భూతానికి నాలుగేళ్లలో 51మంది బలి

image

ర్యాగింగ్ భూతం కారణంగా దేశవ్యాప్తంగా గత నాలుగేళ్లలో 51మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా’ నివేదిక వెల్లడించింది. ‘2020-24 మధ్యకాలంలో 1946 కాలేజీల నుంచి హెల్ప్‌లైన్‌కు 3156 ఫిర్యాదులు అందాయి. అధిక ఫిర్యాదులు వైద్య కళాశాలల నుంచే ఉన్నాయి. మొత్తం కేసుల్లో 45.1శాతం మేర మెడికల్ కాలేజీలవే. మానసిక ఒత్తిడి భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని పేర్కొంది.

News March 24, 2025

VJA: అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా (పిజిఆర్‌ఎస్‌) అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రజల నుంచి కలెక్టర్ 133 అర్జీలను స్వీకరించారు. అయన మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌‌లో నమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

error: Content is protected !!