News March 22, 2025

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉ.8గంటల వరకు 33.0మీ.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా మహదేవ్‌పూర్ 7.0, పలిమెల 4.0, ముత్తారం 1.0, కాటారం 4.3, మల్హర్రావు 1.5, చిట్యాల్ 2.5, టేకుమట్ల 3.3, మొగుళ్లపల్లి 2.0, రేగొండ 1.3, కొత్తపల్లిగోరి 1.3, భూపాలపల్లి 1.8మీ.మీటర్ల వర్షం నమోదయింది.

Similar News

News January 18, 2026

విశాఖ జిల్లా ఆర్టీసీ ఆదాయం రూ.కోటి ఇరువై లక్షలు

image

సంక్రాంతి పండుగలు ముగించుకొని విశాఖ నుంచి తిరిగి వెళుతున్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ద్వారకా బస్సు కాంప్లెక్స్‌లో రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం పర్యవేక్షణ చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్ సర్వీసుల సంఖ్య పెంచినట్టు ఆయన పేర్కొన్నారు. పండుగ నాలుగు రోజుల్లో విశాఖ జిల్లాకు ఆర్టీసీ ద్వారా రూ. కోటి ఇరువై లక్షలు ఆదాయం సమకూరినట్టు తెలిపారు.

News January 18, 2026

గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

image

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ హార్మోన్లు కలిసి ఉన్న మాత్రలు వినియోగించే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్త ప్రవాహం జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టడం వల్ల క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రో‌క్‌లేనని తెలిపారు.

News January 18, 2026

మద్యం నియంత్రణపై వెనక్కి తగ్గేదే లేదు: ఎమ్మెల్యే రాజగోపాల్

image

మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపుల సమయపాలనపై రాజీ పడే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్ షాపులు, సాయంత్రం 6 గంటలకే పర్మిట్ రూములు తెరవాలని నిబంధన విధించారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల దృష్ట్యా ఉదయాన్నే మద్యం విక్రయాలను అరికట్టాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవసరమైతే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు.