News March 22, 2025

గుంటూరు హైవేపై ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

image

గుంటూరు జాతీయ రహదారిపై, అద్దంకి వెళ్లే మార్గంలో మేదరమెట్ల వద్ద శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయం కావడంతో మరణించిన వ్యక్తి వివరాలు, వాహనం ఆనవాళ్లు లభించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 2, 2026

సైనికులను కాదు.. రాజునే లేపెయ్యాలి!

image

ఇరాన్‌తో యుద్ధంలో US-ఇజ్రాయెల్ చేస్తోంది సరిగ్గా ఇదే! రాజు లేని రాజ్యంలో సైనికులు, ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అందుకే తొలి దాడిలోనే ఏకంగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీనే మట్టుబెట్టాయి. దీంతో యుద్ధ నాయకత్వమూ బలహీనపడింది. దిక్కుతోచని స్థితిలో పడ్డ ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమాయక ప్రజలపై దాడులు చేస్తోంది. ఇరాన్ తాత్కాలిక చీఫ్‌గా ఎన్నికైన అయతుల్లా అరాఫీని కూడా ఇజ్రాయెల్ హతం చేసిందనే వార్తలొస్తున్నాయి.

News March 2, 2026

పాలమూరు: కొత్త కలెక్టర్ల రాక.. అక్రమ దందాలకు బ్రేక్ పడేనా?

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఇసుక, మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త కలెక్టర్లు అడుగులు వేయబోతున్నారా? అన్న చర్చ మొదలైంది. జిల్లాలో అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న అక్రమ వ్యాపారాలపై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో జిల్లాకు వచ్చిన ముగ్గురు కొత్త కలెక్టర్లు ఈ గంభీరమైన సమస్యపై ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News March 2, 2026

విశాఖలో యువకుడి ఆత్మహత్య

image

కూర్మన్నపాలెం సమీపంలో గల మంగళపాలెం జెఎన్‌ఎమ్‌ఆర్ దగ్గర టిట్కో ఇంట్లో సోమవారం యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్లంబింగ్ పనులు చేయడానికి ఒడిశా నుంచి వచ్చిన అభినాష్ ప్రధాని (21) అనే యువకుడు ఉరిపోసుకొన్నాడు. ఈ ఘటనపై దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.