News March 22, 2025
ట్రంప్ ఎఫెక్ట్..5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు

USAలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన దాదాపు 5.30 లక్షల మంది పౌరులు అమెరికా వీడనున్నారు. వచ్చే నెల 24తో వారి లీగల్ స్టేటస్ రద్దవుతుంది. యుద్ధం లేదా ఇతర కారణాలతో అనిశ్చితి నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం కల్పిస్తారు.
Similar News
News March 23, 2025
BREAKING: కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి 7 గంటల వరకు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌లో వాన పడుతుందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 23, 2025
ఆ 2 రోజులు VIP బ్రేక్ దర్శనాలు రద్దు

AP: తిరుమలలో ఈ నెల 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో 24, 29వ తేదీల్లో సిఫారసు లేఖలు అనుమతించబోమని తెలిపింది. మరోవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలను 23వ తేదీ స్వీకరించి 24న దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
News March 23, 2025
KCRకు దొంగ నోట్లు ముద్రించే ప్రెస్: బండి సంజయ్

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నకిలీ నోట్లనే ఓటర్లకు పంచారన్నారు. ప్రస్తుతం భూములు అమ్మితే గానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. అలాగే రాష్ట్రంలో ప్రతి పనికీ కమీషన్ల వ్యవహారం నడుస్తోందని విమర్శించారు.