News March 22, 2025
ALERT: సాతర్లలో గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదు

గద్వాల జిల్లాలో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. శుక్రవారం సాతర్లలో గరిష్ఠంగా 39.5, తోతినోనిదొడ్డి, ధరూర్, గద్వాల్, అలంపూర్‌లో 39.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితేనే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News March 23, 2025
త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి: సత్యకుమార్ యాదవ్

AP: బలభద్రపురం క్యాన్సర్ కేసులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘<<15850475>>బలభద్రపురం<<>>లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం. ఇంటింటికీ వెళ్లి వైద్యులు సర్వే చేస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నాం. త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తూ.గో జిల్లా బిక్కవోలు(M) బలభద్రపురంలో 200 మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే.
News March 23, 2025
ఖమ్మం: ఆడబిడ్డ పుడితే స్వీట్లతో శుభాకాంక్షలు

జిల్లాలో ఆడపిల్ల పుట్టిన ఇంటికి అధికారులు వెళ్లి మిఠాయి బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలపాలని, ‘గర్ల్ ప్రైడ్’ పేరిట ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమ్మాయి పుట్టడం శుభ సూచకమనే ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇటీవల దివ్యాంగులకు కలెక్టరేట్లో ఉచిత భోజనం వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్‌ను అభినందిస్తున్నారు.
News March 23, 2025
టీబీ విభాగంలో భద్రాద్రికి రెండో బహుమతి

రాష్ట్ర స్థాయిలో క్షయ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు 2024 ఏడాదికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి లభించింది. శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ రిజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశం చేతుల మీదుగా డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ బాలాజీ అవార్డు అందుకున్నారు.