News March 25, 2024

హోలి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

ఈ హోలికి కొత్త కొత్త రంగులతో కొత్త ధనానికి మరిన్ని విజయాలకు స్వాగతం పలుకుతూ అందరి జీవితాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ బేధ భావాలు వీడి పరస్పర ప్రేమాభిమానాలతో సంతోషంగా మోదుగు పూల వంటి సహజ సిద్ధమైన రంగులతో వసంత కాలానికి నాందిగా మొదలైన హోలీ పండుగను జరుపుకోవాలని సూచించారు.

Similar News

News July 8, 2025

మెదక్: రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

image

మెదక్ ఆర్టీసీ డిపోలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ సోమవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రేపు ఉ.11 గంటల నుంచి మ.12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు తమ సందేహాల నివృత్తికి 7842651592 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.

News July 8, 2025

మెదక్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2025

మెదక్: పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి: టీపీటీఎఫ్

image

బదిలీలతోపాటు పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. మెదక్‌లోని ఉపాధ్యాయ భవన్‌లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, నగదు రహిత వైద్యం అందించాలని, పెండింగ్‌లో ఉన్న 4విడతల డీఏను విడుదల చేయాలన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి, మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి ఉన్నారు.