News March 22, 2025

అనకాపల్లిలో రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

image

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట మండలం నేషనల్ హైవేపై ఎన్‌జీ పాలెం వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకున్నాడు. అతికష్టం మీద అతడిని బయటకు తీశారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 16, 2026

విశాఖ: 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు

image

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 2 రోజులుగా విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు,ర వాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.52,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు.

News January 16, 2026

ఎల్ఐసీ బిల్డింగ్ సమీపంలో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్ఐసీ బిల్డింగ్ మధ్యలో ఉన్న బస్టాప్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు 75 సంవత్సరాలు దాటి ఉంటుందని ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం తెలిపారు. వైట్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News January 16, 2026

విశాఖ: చీర విషయంలో గొడవ.. బాలిక ఆత్మహత్య

image

విశాఖలో పండగ పూట విషాదం నెలకొంది. MVP పోలీసుల వివరాల ప్రకారం.. పాత వెంకోజీ పాలెంలో ఉంటున్న బాలిక పల్లవి పండగ సందర్భంగా చీర కట్టుకుంటానని తల్లి లక్ష్మిని కోరింది. చీర వద్దు హాఫ్‌శారీ కట్టుకోమని తల్లి చెప్పడంతో గురువారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన పల్లవి MVP కాలనీలో తన తాతయ్య వాచ్మెన్‌గా ఉంటున్న రెసిడెన్సి వద్ద ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.