News March 22, 2025
వ్యోమగాములకు నా సొంత డబ్బు చెల్లిస్తా: ట్రంప్

8రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్‌మోర్ 9 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఆ అదనపు కాలానికి వారిద్దరికీ రోజుకు చెరో 5 డాలర్ల చొప్పున 286 రోజులకు 1430 డాలర్ల వేతనాన్ని నాసా ఇవ్వకపోవడంపై ట్రంప్ విస్మయం వ్యక్తం చేశారు. ఆ విషయం తనకు తెలియదని తెలిపారు. అవసరమైతే తన సొంత డబ్బునే వారికి జీతాలుగా ఇస్తానని స్పష్టం చేశారు.
Similar News
News March 23, 2025
మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్ కీలక నిర్ణయాలు

మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణసాయం కింద రూ.50వేలు, ఆయుధాలు సరెండర్ చేస్తే వాటి స్థాయిని బట్టి రూ.5లక్షల వరకు ఇవ్వనుంది. రూ.5లక్షలకు ఆపై రివార్డు ఉన్న నక్సల్స్ లొంగిపోతే ఇంటి లేదా వ్యవసాయ భూమి ఇస్తుంది. భూమి అందుబాటులో లేకపోతే రూ.2లక్షల నగదు అందజేయనుంది. అలాగే పెళ్లి కాని, వితంతు మహిళలకు రూ.లక్ష సాయం చేయాలని నిర్ణయించింది.
News March 23, 2025
BREAKING: కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి 7 గంటల వరకు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌లో వాన పడుతుందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 23, 2025
ఆ 2 రోజులు VIP బ్రేక్ దర్శనాలు రద్దు

AP: తిరుమలలో ఈ నెల 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో 24, 29వ తేదీల్లో సిఫారసు లేఖలు అనుమతించబోమని తెలిపింది. మరోవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలను 23వ తేదీ స్వీకరించి 24న దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.