News March 22, 2025
HYD: భార్య వీడియోలు భర్తకు పంపి.. బ్లాక్ మెయిల్!

విదేశంలో HYD యువతికి వేధింపులు ఎదురయ్యాయి. శ్రీకృష్ణానగర్ వాసి 2018లో పనికోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన అబూబాకర్ ఆమె వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. 2020లో బాధితురాలు HYD వచ్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఏకంగా ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. కాల్ చేసినా ఆమె బయటకురావడం లేదని ఆ వీడియోలు ఆమె భర్తకు పంపాడు. ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 25, 2025
తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంతంటే?

తెలంగాణకు ₹4,42,298 కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్రం లోక్ సభలో వెల్లడించింది. ఈ విషయంలో దేశంలో TG 24వ స్థానంలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలాగే రాష్ట్రంలో గత 6 ఏళ్లలో 10,189 IT కంపెనీలు ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా తెలిపారు. ఇదే సమయంలో 3,369 సంస్థలు మూతపడ్డాయని పేర్కొన్నారు. ఈ కంపెనీల ద్వారా గత ఐదేళ్లలో ₹14,865కోట్ల టర్నోవర్ జరిగిందని వివరించారు.
News March 25, 2025
WNP: మిల్లులపై కేసులు బుక్ చేయండి: కలెక్టర్

గత సీజన్‌లో ధాన్యం తీసుకొని ఇప్పటివరకు CMR ఇవ్వని రైస్ మిల్లులపై కేసులు నమోదుచేసి, RR యాక్ట్ కింద చర్యలుచేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్ లో పౌరసరఫరాల అధికారులతో కలెక్టర్ సమీక్షనిర్వహించారు. 2024-25 వానాకాలానికి సంబంధించి 100% CMR ధాన్యం అప్పగించిన మిల్లర్లకు మాత్రమే తదుపరి సీజన్ ధాన్యం కేటాయించాలని కలెక్టర్ సూచించారు. రబిసీజన్ వరిధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
News March 25, 2025
మహబూబ్నగర్: రెండు పథకాలు.. ఈనెల 31 లోపు ఖాతాల్లోకి డబ్బులు

సీఎం రేవంత్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా, భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున మార్చి 31 లోపు జమ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రైతు భరోసా కోసం రూ.18,000 కోట్లు కేటాయించింది. ఉగాది పండుగ నాటికి అర్హులకు పూర్తిగా జమచేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.