News March 22, 2025

గద్వాల: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

image

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT

Similar News

News January 8, 2026

ఎమ్మెల్సీ సారయ్య 2.0

image

వరంగల్ జిల్లాలో MLC బస్వరాజు సారయ్య మాటే శాసనంలా మారింది. ఎప్పుడో జరిగిన కేసుల్లో అక్రమార్కులను సస్పెన్షన్లు చేయిస్తూ, పోలీసులకు దడ పుట్టిస్తున్నారు. మరో పక్క మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సారయ్య పవర్ సెంటర్‌గా మారారు. పనుల కోసం మంత్రి దగ్గరి కంటే ఎమ్మెల్సీ దగ్గరికే ఎక్కువగా వస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న మంత్రి పొంగులేటి రివ్యూలో సైతం అధికారులపై రుసరుసలాడటం చర్చనీయాంశంగా మారింది.

News January 8, 2026

సిద్దిపేట POLICE BOSS నేపథ్యం ఇదే..!

image

సిద్దిపేట సీపీగా సాధన రష్మి పెరుమాళ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈమె HYDలో నార్త్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న 2019 బ్యాచ్‌కు చెందిన ఈమెను సిద్దిపేట సీపీగా బదిలీ చేశారు. సీపీగా వస్తున్న రష్మి పెరుమాళ్ నేరాలను అరికట్టడంలో పేరు తెచ్చుకున్నారు. మహిళల భద్రతకు పెద్ద పీట వేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫెర్టిలిటీ కేసును పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.

News January 8, 2026

మెదక్: తీవ్ర విషాదం.. బురదలో రైతు మృతి

image

కౌడిపల్లి మండలంలో మర్రి చెట్టు తండాలో పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు బురదలో పడి గిరిజన రైతు మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మర్రి చెట్టు తండా చెందిన కాట్రోత్ దినాకర్(28) తన పొలంలో వరి నాటు కోసం పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు జారి బురదలో పడిపోయాడు. స్థానిక రైతులు చూసి దినాకర్‌ను లేపి చూడగా, అప్పటికే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.