News March 22, 2025
సైబర్ నేరగాళ్లకూ టార్గెట్.. ఛేదించకపోతే నరకమే!

ఉద్యోగాల కోసం ఏజెంట్ ద్వారా మయన్మార్, థాయ్‌లాండ్‌కు వెళ్లి సైబర్ ముఠా వలలో చిక్కుకున్న 589 మంది భారతీయులను కేంద్రం రక్షించింది. సైబర్ క్రైమ్స్ చేయడమే ఆ ఉద్యోగమని తెలియక అక్కడికి వెళ్లి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘వీసా లాక్కుంటారు. టార్గెట్స్ చేరుకోకపోతే ఎండలో 4కి.మీలు పరిగెత్తిస్తారు. పుష్అప్స్ చేయిస్తారు. పాడైపోయిన బాతు గుడ్లు తినిపిస్తారు’ అని తెలంగాణకు చెందిన ఓ బాధితుడు BBCతో చెప్పారు.
Similar News
News March 24, 2025
ర్యాగింగ్ భూతానికి నాలుగేళ్లలో 51మంది బలి

ర్యాగింగ్ భూతం కారణంగా దేశవ్యాప్తంగా గత నాలుగేళ్లలో 51మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా’ నివేదిక వెల్లడించింది. ‘2020-24 మధ్యకాలంలో 1946 కాలేజీల నుంచి హెల్ప్‌లైన్‌కు 3156 ఫిర్యాదులు అందాయి. అధిక ఫిర్యాదులు వైద్య కళాశాలల నుంచే ఉన్నాయి. మొత్తం కేసుల్లో 45.1శాతం మేర మెడికల్ కాలేజీలవే. మానసిక ఒత్తిడి భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని పేర్కొంది.
News March 24, 2025
బోరుగడ్డ అనిల్‌కు వచ్చే నెల 4 వరకూ రిమాండ్

బోరుగడ్డ అనిల్‌కు నరసరావు పేట కోర్టు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించింది. ఫిరంగిపురం పోలీసులు ఈరోజు ఆయన్ను పీటీ వారెంట్‌పై సివిల్ జడ్జి వద్ద హాజరుపరచగా ఆయన రిమాండ్ విధించారు. కాగా అనిల్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
News March 24, 2025
రాత్రి బెడ్ రూమ్‌లో ఇలా చేస్తున్నారా?

నిద్ర పోయే సమయంలో బెడ్ రూమ్‌లోకి దోమలు రాకుండా నివారణ యంత్రాలను వాడుతుంటారు. వీటి వాసనను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే హానికరమైన రసాయనాలతో శ్వాస సంబంధిత వ్యాధులకు ఆస్కారం ఉందంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెంపుడు జంతువులపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. వీటికి బదులుగా సహజ ప్రత్యామ్నాయాలు వాడటం, దోమతెరలను ఉపయోగించడం ఉత్తమమని చెబుతున్నారు.