News March 22, 2025
భద్రాద్రి: ఇంకుడుగుంతలతో.. నీటిని ఒడిసిపడుదాం!

నీరు మానవాళి ఆరోగ్యానికి శ్రేయస్కరం. కానీ బాధ్యతారాహిత్యంతో దుర్వినియోగమవుతుండగా, మార్చి 22న జల దినోత్సవం నిర్వహించి, అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తులో భద్రాద్రి జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, మినీ వాటర్ హోల్స్ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అలాగే చెరువులు, కుంటలనూ పునరుద్ధరించాలి. నీటి వృథాపై పిల్లలకు అవగాహన కల్పిస్తే భవిష్యత్తు అవసరాలకు ఢోకా లేనట్లే.
Similar News
News January 15, 2026
మున్సిపల్ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు

TG: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో జనరల్ 30, జనరల్ మహిళ 31, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19, ఎస్సీ జనరల్ 9, SC మహిళ 8, ఎస్టీ జనరల్ 3, ST మహిళలకు 2 స్థానాలు కేటాయించింది. 10 కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళ 4, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, ఎస్సీ 1, ఎస్టీకి ఒక స్థానంలో కేటాయింపులు చేసింది. ఈ నెల 17లోపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది.
News January 15, 2026
భారత్ ఓటమి.. వీటికి సమాధానమేది?

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమ్ ఇండియా ఓటమితో పలు ప్రశ్నలు వస్తున్నాయి. ‘ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జడేజా తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఎంత వరకు కరెక్ట్? బుమ్రాకు రెస్ట్ ఉన్న సమయంలో స్టార్ బౌలర్‌గా పేరున్న అర్షదీప్ సింగ్‌ను బెంచ్ పరిమితం చేయడమేంటి? పదే పదే జడేజాను నమ్ముకోకుండా ప్రత్నామ్నాయంపై దృష్టి పెట్టాలి’ అని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. మీరేమంటారు?
News January 15, 2026
HYD: రేపు రాత్రి ఆకాశంలో జాతర

సంక్రాంతి వేళ పతంగుల జోష్ మామూలుగా లేదు. భోగి వేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా భవనాల మీద తెగ ఎంజాయ్ చేశారు. పతంగులు కాట్ చేస్తూ కేరింతలు చేశారు. ఇక రేపు రాత్రి కూడా వైబ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా బేగంబజార్‌లో నైట్ కైట్ ఫెస్టివల్ అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం తర్వాత చిన్న ఎయిర్‌బెలూన్‌లు, లైట్ పతంగులను భవనాల మీద ఎగరేస్తుంటారు. ఇక్కడ పతంగుల జాతరను చూసేందుకు నగర నలుమూలల నుంచి తరలివెళ్తారు.


