News March 22, 2025

మెదక్ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

image

మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని కౌడిపల్లి 38.1, హవేళిఘనపూర్ 37.7, వెల్దుర్తి 37.6, మెదక్ 37.5, అల్లాదుర్గ్ 37.3, శివ్వంపేట 37.2, రేగోడ్, పాపన్నపేట 37.1, చేగుంట 36.9 కుల్చారం, చిన్న శంకరంపేట 36.8, పెద్ద శంకరంపేట, మనోహరాబాద్ 36.5 °C గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News January 23, 2026

సైన్స్ ఫెయిర్‌లో మెదక్ జిల్లాకు 3 బహుమతులు

image

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరిగిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా ప్రతిభ చాటిందని డిఈఓ విజయ తెలిపారు. టీచర్ ఎగ్జిబిట్ విభాగంలో కొడపాక జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు వెంకటరమణ ప్రథమ స్థానం సాధించారు. విద్యార్థుల విభాగంలో తూప్రాన్ గీత స్కూల్ విద్యార్థిని మహతి 3వ స్థానం, సిద్ధార్థ రూరల్ స్కూల్ విద్యార్థి అక్షయ్ 4వ స్థానంలో నిలిచారు. విజేతలను డిఈఓ అభినందించారు.

News January 23, 2026

మెదక్: 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

image

ఈ నెల 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఓటరు దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ అవగాహన ర్యాలీపై అధికారులతో సమీక్షించారు. నా భారత్ – నా ఓటు అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలన్నారు.

News January 23, 2026

MDK: ‘ఆపరేషన్ స్మైల్’.. 49 మంది చిన్నారులకు విముక్తి

image

మెదక్ జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ ద్వారా ఇప్పటివరకు 49 మంది బాలకార్మికులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మరో 12 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించామని, ఈ విషయంలో జిల్లావ్యాప్తంగా 41 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పనిలో చేరిన నలుగురు పిల్లలను తిరిగి బడిలో చేర్పించామని, బాల్యానికి అండగా నిలుస్తామని డీపీఓ అధికారుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.