News March 22, 2025

నంద్యాల జిల్లాలో దారుణ హత్య

image

బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Similar News

News January 17, 2026

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.380 పెరిగి రూ.1,43,780కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,31,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు పెరిగి రూ.3,10,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి

News January 17, 2026

పాలమూరు: మందుబాబులు తగ్గేదేలే..!

image

సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు రోజుల్లో ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా రూ.64.9 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జనవరి 12న రూ.9.56 కోట్లు, 13న రూ.8.66 కోట్లు, 14న రూ.9.87 కోట్లు, 16న రూ.11.81 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 227 మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి ఈ ఆదాయం లభించినట్లు పేర్కొన్నారు.

News January 17, 2026

సికింద్రాబాద్: ‘ర్యాలీకి పోలీసుల అనుమతి లేదు’

image

సికింద్రాబాద్ సాధన సమితి నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ సీపీ ఈ మేరకు స్పష్టం చేశారు. భద్రతా కారణాలు, ట్రాఫిక్‌ ఇబ్బందుల నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ, ప్రజావర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.