News March 22, 2025
భువనగిరి జిల్లాలో వర్షపాత వివరాలు

భువనగిరి జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా భువనగిరి మండలంలో 29మిమీ వర్షం కురవగా, అత్యల్పంగ మోత్కూర్ మండలంలోని దతప్పగూడెంలో 0.8మిమీ వాన పడింది. యాదగిరిగుట్టలో 23.8మిమీ, బొమ్మలరామారం 23.3మిమీ, మూటకొండూర్ 20 మిమీ, రాజాపేట 17.3మిమీ, తుర్కపల్లి 16.3మిమీ, ఆత్మకూర్ 7.8మిమీగా నమోదైంది.
Similar News
News March 23, 2025
ముంబై టీమ్‌లో సత్యనారాయణ రాజు.. ఎవరితను?

IPLలో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చారు. ముంబై టీమ్ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని MI రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి ఓ రొయ్యల వ్యాపారి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో రాయలసీమ కింగ్స్‌కు ఆడిన రాజు 6.15 ఎకానమీతో 8 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీలో 16, లిస్ట్ ఏ క్రికెట్‌లో 9, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 వికెట్లు తీశారు.
News March 23, 2025
అనకాపల్లి జిల్లాలో లారీ బీభత్సం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

మాడుగుల మండలం గాదిరాయిలో ఓ ట్రాలీ లారీ ఆదివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. గాదిరాయి వద్ద లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి 3 బైకులను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైకులపై వెళ్తున్న ఐదుగురు తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ నారాయణరావు చెప్పారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News March 23, 2025
రాష్ట్రంలో 8 మంది మృతి

TG: రాష్ట్రంలో జరిగిన పలు ఘటనల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట (D) బీబీగూడెం వద్ద కారు-బస్సు ఢీకొన్నాయి. ఘటనలో కారులోని భార్యాభర్త, పాప(8), మరొకరు చనిపోయారు. మృతుల్లో రవి, రేణుక, రితికను గుర్తించారు. అలాగే, హనుమకొండ- కరీంనగర్ NHపై హసన్‌పర్తి పెద్దచెరువు వద్ద టూవీలర్ను టిప్పర్ ఢీకొట్టగా పవన్, మహేశ్ మృతిచెందారు. నల్గొండ (D) ఏపూరులో ఈతకు వెళ్లి నవీన్(23), రాఘవేంద్ర(20) నీటమునిగి చనిపోయారు.