News March 25, 2024
100 మైళ్లు నడిచి.. రికార్డు బద్దలు కొట్టి..

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బార్క్‌లీ మారథాన్‌ను పూర్తి చేసిన మొదటి మహిళగా జాస్మిన్ పారిస్(ఇంగ్లండ్) చరిత్ర సృష్టించారు. ఫినిషింగ్ లైన్ వద్ద ఆమె కూలబడిపోయిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 60గంటల్లో పూర్తి చేయాల్సిన మారథాన్‌ను 99 సెకన్లు మిగిలి ఉండగానే ఆమె పూర్తి చేశారు. 1989లో ఈ 100 మైళ్ల మారథాన్ మొదలవగా.. ఇప్పటి వరకు 20మంది పురుషులు మాత్రమే దీన్ని పూర్తి చేయగలిగారు.
Similar News
News March 14, 2026
నెతన్యాహు చనిపోయారా?

ఇరాన్‌తో యుద్ధం వేళ సంచలన ప్రశ్న తెరపైకి వచ్చింది. నెతన్యాహు మృతి చెందారని SMలో ప్రచారం జరుగుతోంది. యుద్ధం గురించి మాట్లాడిన వీడియోను ఆయన నిన్న Xలో షేర్ చేశారు. అందులో నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లున్నాయి. దీంతో ఇది AI వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెతన్యాహు మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఇలా AIతో వీడియో చేసి రిలీజ్ చేశారని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.
News March 14, 2026
FIFA WC, 2028 ఒలింపిక్స్‌కు నో ఎంట్రీ.. ట్రంప్‌కు షాక్ తప్పదా?

USలో ఈ ఏడాది జరిగే FIFA WC, 2028 LA ఒలింపిక్స్‌కు ట్రంప్‌ను, ప్రభుత్వ అధికారులను నిషేధించాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) యోచిస్తున్నట్లు సమాచారం. 2023 నుంచి తమకు చెల్లించాల్సిన $7.3 మిలియన్లను US పెండింగ్‌లో ఉంచడమే కారణమని తెలుస్తోంది. 2014 సోచి వింటర్ ఒలింపిక్స్‌లో రష్యన్, 2024లో చైనా అథ్లెట్లు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినప్పటికీ నిర్దోషులుగా తేల్చడంతో WADA, US మధ్య విభేదాలు ముదిరాయి.
News March 14, 2026
మళ్లీ వర్షాలు!

ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో HYD, ఉ.గోదావరి, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.


