News March 22, 2025

రేషన్ షాపుల్లో సన్నబియ్యం.. UPDATE

image

TG: పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి వేదిక ఖరారైంది. ఉగాది రోజున సూర్యాపేటలోని మట్టపల్లి ఆలయం నుంచి ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని ద్వారా 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు 6కేజీల చొప్పున సన్నబియ్యం అందుకోనున్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వనున్నారు.

Similar News

News January 13, 2026

జగ్గన్నతోటకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

image

కోనసీమ సంస్కృతికి అద్దం పట్టే జగన్నతోట ప్రభల తీర్థానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారులోని ఈ ప్రాంతం ఒకప్పుడు జగన్నాథ రాజు అనే వ్యకికి చెందిన కొబ్బరి తోట. ఏకాదశ రుద్రుల సమ్మేళనం కోసం ఆయన తన భూమిని కేటాయించడంతో దీనికి ‘జగన్నతోట’ అని పేరు వచ్చింది. కనుమ నాడు ఇక్కడ జరిగే ప్రభల ఊరేగింపు, భక్తుల కోలాహలం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.

News January 13, 2026

చర్మం పొడిబారి రాలుతోందా?

image

శీతాకాలం మొదలైతే చాలు చర్మం పొడిబారడం, ఎండిపోయి జీవం కోల్పోయినట్టుగా ఉండటం చాలామందిలో కనిపించే సమస్య. చర్మం బాగా పగిలిపోతే కలబంద రాయాలి. ఇది చర్మానికి చల్లదనం ఇవ్వడమే కాదు.. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దురద, నొప్పిని తగ్గిస్తాయి. ఆలివ్‌ నూనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి, జొజోబా నూనెలను సమపాళ్లలో తీసుకొని దానికి కొన్నిచుక్కల టీట్రీ ఆయిల్‌ కలిపి చర్మానికి రాయాలి.

News January 13, 2026

‘జిగురు అట్టల’తో రసంపీల్చే పురుగుల ఆటకట్టు

image

పంటలకు హానిచేసే రసం పీల్చే పురుగుల కట్టడిలో జిగురు అట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది. వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను.. తెలుపు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్‌ త్రిప్స్‌.. నీలిరంగు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకర్షిస్తాయి. ఈ అట్టలపై వాలగానే ఆ పురుగులు అతుక్కుని చనిపోతాయి.