News March 22, 2025
BREAKING: ఓర్వకల్లుకు చేరుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు కర్నూలు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. కాగా, మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన ఓర్వకల్లు మండల పరిధిలోని పూడిచర్ల చేరుకొనున్నారు.
Similar News
News October 28, 2025
మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం: మంత్రి పార్థసారథి

తుఫాను సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా అధికార యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. మంగళవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
News October 28, 2025
‘జగిత్యాలకు రూ.62.50 కోట్ల అభివృద్ధి నిధులు’

JGTL మున్సిపాలిటీకీ అత్యధికంగా రూ.62.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. CMను కలిసి వినతిపత్రం ఇచ్చిన వెంటనే నిధులు ఆమోదించారని చెప్పారు. ఇప్పటికే కరెంట్, డ్రైనేజీ, రోడ్లు, నీటి సరఫరా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.20 కోట్లు ప్రతిపాదనలు పంపామని, జగిత్యాల జిల్లా అభివృద్ధిలో TGకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
News October 28, 2025
SRPT: ‘సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించాలి’

సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారామారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. మూఢ నమ్మకాలను పారద్రోలి శాస్త్రీయ వైఖరులను పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు, సభ్యులు రామచంద్రయ్య దయానంద్ ఉన్నారు.


