News March 25, 2024

అర్వింద్ కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్: ఈడీ

image

రెండేళ్ల క్రితం లిక్కర్ స్కామ్ జరిగిన సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వాడిన ఫోన్ కనిపించడం లేదని ఈడీ తాజాగా తెలిపింది. అది ఆయన వాడిన 171వ ఫోన్ అని, స్కామ్‌కు సంబంధించిన సమాచారం దానిలో ఉందని స్పష్టం చేసింది. విచారణలోనూ దాని గురించి తనకు తెలియదని కేజ్రీవాల్ చెప్పారని ఈడీ పేర్కొంది. మొత్తంగా కేసులో 36మంది నిందితులకు చెందిన 170 ఫోన్లు మిస్ కావడం గమనార్హం.

Similar News

News October 3, 2024

వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చడం దురదృష్టకరం: వెంకటేశ్

image

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు’ అని పేర్కొన్నారు.

News October 3, 2024

మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ పార్టీ చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నమామి గంగ ప్రాజెక్టుకు ఒక్కో కి.మీకు రూ.17 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ మూసీ సుందరీకరణకు ఒక్కో కి.మీకు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదెక్కడి వింత? ఈ స్కామ్ నిధులు మొత్తం కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులోకే వెళ్తున్నాయి’ అని ఆయన ట్వీట్ చేశారు.

News October 3, 2024

Stock Markets Crash: రూ.3 లక్షల కోట్లు ఆవిరి

image

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లు వణుకుతున్నాయి. అనిశ్చితి నెలకొనడం, సప్లై చైన్ అవాంతరాలు, క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల భారీగా క్రాష్ అవుతున్నాయి. BSE సెన్సెక్స్ 725 పాయింట్ల నష్టంతో 83,542, NSE నిఫ్టీ 218 పాయింట్లు ఎరుపెక్కి 25,578 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. నిఫ్టీలో 41 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. JSW స్టీల్, ONGC టాప్ గెయినర్స్.