News March 22, 2025

HYD: పదోన్నతి.. ఇంతలోనే అడిషనల్ DCP మృతి

image

హయత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అడిషనల్ DCP బాబ్జీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పోలీస్ శాఖ తీవ్ర సంతాపం ప్రకటించింది. మార్చి 18న ఆయన అడిషనల్ SP ర్యాంక్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. ఇంతలోనే మృతి చెందడాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద అంబర్‌పేటలో నివాసం ఉండే బాబ్జీ‌కి ఉదయం వాకింగ్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే హైవే మీద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టింది.

Similar News

News March 25, 2025

OTTలోకి సందీప్ కిషన్ ‘మజాకా’

image

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ‘మజాకా’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఉగాది కానుకగా ఈ నెల 28 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ మూవీలో ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా గత నెల 26న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

News March 25, 2025

BNR: నిర్వాసితులకు అన్ని రకాల మౌలిక వసతులు: R&R కమిషనర్

image

ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు కేటాయించిన అర్&అర్ కాలనీలలోఅన్ని రకాల మౌలిక సౌకర్యాలు వేగవంతం చేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో అర్&అర్ పనులను సమీక్షించారు.

News March 25, 2025

డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మృతి

image

తమిళ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా(48) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన తాజ్‌మహల్, అల్లీ అర్జున, అన్నక్కోడి, పల్లవన్, తదితర తమిళ చిత్రాల్లో నటించారు.

error: Content is protected !!