News March 22, 2025
మదనపల్లెలో మైనర్ బాలికకు పెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు

మదనపల్లె మండలంలో మైనర్ బాలికకు పెళ్లి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మదనపల్లె మండలం బొమ్మనచెరువు పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికకు వారం క్రితం తండ్రికి తెలియకుండా తల్లి పెళ్లి చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి మదనపల్లె తాలూకా పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు బాలిక తల్లికి ఫోన్ చేసి స్టేషక్‌కు రావాలన్నారు.
Similar News
News March 26, 2025
చిత్తూరు జిల్లాలో RIలకు పదోన్నతి

చిత్తూరు జిల్లాలో RIలకు DTలుగా పదోన్నతిని కల్పిస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ☞ పెద్దపంజాణి డీటీ-యుగేశ్☞ ఇనాం డీటీ-రాజశేఖర్☞ పుంగనూరు ఎన్నికల డీటీ-మోహన్ ☞ చౌడేపల్లి డీటీ- నందినిదేవి☞ కుప్పం సీఎస్టీ-రేఖ ,జోత్స్న ☞ కుప్పం ఈడీటీ- జోత్స్న☞ పలమనేరు సీఎస్‌ఈటీ-శిరీష☞ కుప్పం రీసర్వే డీటీ-నరేంద్ర☞ వీకోట రీసర్వే డీటీ-శోభ ☞ సోమల డీటీగా మధుసూదన్‌కు పోస్టింగ్ ఇచ్చారు.
News March 26, 2025
రూ.2 కోట్లు.. సచివాలయం చెల్లించాల్సిన ఆస్తి పన్ను

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయాన్ని ఘనంగా, గొప్పగా నిర్మించిన ప్రభుత్వం ఆ భవనానికి సంబంధించి ఆస్తి పన్ను ఇంకా చెల్లించలేదు. మహానగర వ్యాప్తంగా ఆస్తిపన్ను వసూలు చేస్తున్న అధికారులకు పెండింగ్ బిల్లు జాబితాలో రాష్ట్ర సచివాలయం కనిపించింది. దాదాపు రూ.2 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మార్చి 31లోపు ఈ మొత్తాన్ని ఎలా రాబట్టాలని గ్రేటర్ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
News March 26, 2025
గొల్లాదిలో కొట్లాట.. ఏడుగురుకి గాయాలు

బాడంగి మండలం గొల్లాది పోలమ్మ ఆలయం సమీపంలో కామన్నవలస, గొల్లాది గ్రామానికి చెందిన వారి మధ్య మంగళవారం కొట్లాట జరిగినట్లు ఎస్ఐ తారకేశ్వరరావు చెప్పారు. ఆలయం సమీపంలో గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు మేకలు మేపుతుండగా కామన్నవలసకి చెందిన ఆదినారాయణ మేకలు మేపేందుకు వచ్చాడు. వారి మధ్య కొట్లాట జరగడంతో ఇరువర్గాలకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.