News March 22, 2025
డీలిమిటేషన్‌తో ఉత్తరాది డామినేషన్: కేటీఆర్

TG: డీలిమిటేషన్‌కు బీఆర్ఎస్ వ్యతిరేకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడులో అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఎంపీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఉత్తరాది డామినేషన్ పెరుగుతుందన్నారు. బీజేపీ చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు.
Similar News
News March 24, 2025
సుపరిపాలన అందించే రాష్ట్రాలు బలహీనపడాలా?: కేశినేని నాని

AP: నియోజకవర్గాల పునర్విభజన వల్ల AP, TG, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని మాజీ ఎంపీ కేశినేని నాని అన్నారు. జనాభా ప్రాతిపదికన చేపట్టనున్న ఈ ప్రక్రియ న్యాయమైనదేనా? అని SMలో ప్రశ్నించారు. సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడాలా అని ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజన జాగ్రత్తగా నిర్వహించకపోతే ఉత్తర-దక్షిణ విభేదాలు పెరుగుతాయని హెచ్చరించారు.
News March 24, 2025
ఆందోళన వద్దు.. ఆదుకుంటాం: సీఎం

AP: అకాల వడగండ్ల వర్షాల కారణంగా పంట నష్టపోయి అనంతపురం(D)లో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై CM చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు. వర్షాలకు 4 జిల్లాల్లో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. దీంతో ప్రభుత్వ పరంగా వారికి సాయం అందించాలని CM ఆదేశించారు. నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందొద్దని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
News March 23, 2025
కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు: KTR

TG: ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా CM రేవంత్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆరే మళ్లీ వస్తే బాగుండేదని రైతులు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై అసూయ, ద్వేషంతో దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే అని ఆరోపించారు.