News March 22, 2025
కడప: ‘వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడు’

కడప జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడని టీడీపీ నేత ఆలూరి నరసింహులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తమాధవరం మాజీ సర్పంచ్ ఫేక్ డాక్యుమెంట్లతో రూ.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి, అక్కడ హోటల్ కడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో, అలాగే మంత్రిని కలిసి ఫిర్యాదు చేశాడు.
Similar News
News September 11, 2025
చాపాడు: మాల్కంబీ రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

మాల్కంబీ రాష్ట్ర స్థాయి పోటీలకు చాపాడు మండల నరహరిపురం పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు నరసింహ శాస్త్రి తెలిపారు. మైదుకూరు మేధా డిఫెన్స్ అకాడమిలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ఐ (మాల్కంబీ) క్రీడలలో జిల్లా స్థాయి పోటీల నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు అండర్ 17 విభాగంలో వి. సుబ్బలక్ష్మి (10వ తరగతి), కె. మస్తాన్ వల్లి (9వ తరగతి) ఎంపిక అయ్యారని తెలిపారు.
News September 11, 2025
ఎర్రగుడిపాడులో రైలులో నుంచి పడి యువకుడి మృతి

ఎర్రగుంట్ల – ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కింద పడి అరవిందు (21) మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువకుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.
News September 11, 2025
ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ బకాయిల వివరాలు

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేలంపై కౌన్సిల్ సమావేశంలో 24 గంటలు ఉత్కంఠత అనంతరం ఆమోదం తెలిపారు. 9 ఏళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపాలిటీకి బకాయిలు పెడుతూనే ఉన్నారు. వాటి వివరాలు (లక్షలలో)..
2015లో రూ.3.96, 2016లో రూ.3.13, 2017లో రూ.2, 2018లో రూ.4.75, 2019లో రూ.8.02, 2021లో రూ.7.10, 2022లో రూ.30.06, 2023లో రూ.5.66, 2024లో రూ.31.50 బకాయిలు మున్సిపాలిటీకి రావాల్సి ఉంది.