News March 22, 2025
బెట్టింగ్ రాయుళ్లపై నజర్ పెట్టండి: వరంగల్ సీపీ

నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమవుతున్న వేళ క్రికెట్ బెట్టింగ్‌లకు అవకాశం ఉండటంతో WGL CP సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో బెట్టింగ్ రాయుళ్లపై నిఘా పెట్టాలని, యువత బెట్టింగ్‌పై ఆసక్తి చూపకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై నిఘా పెట్టాలని, ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News November 8, 2025
జీరో టిల్లేజీలో మొక్కజొన్న సాగు – సూచనలు

జీరో టిల్లేజి పద్ధతిలో వరిచేను కోశాక దుక్కి దున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. బరువైన, తేమను నిలుపుకొనే నేలలో మాత్రమే ఈ పద్ధతిని పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుంచి జనవరి మొదటి వారం వరకు నాటవచ్చు. వరి కోత తర్వాత నేలలో తగినంత తేమ లేకపోతే ఒక తేలికపాటి తడిచ్చి పంట విత్తుకోవాలి. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. ఉండేట్లు విత్తాలి.
News November 8, 2025
60 ఏళ్ల వృద్ధుడు ₹1800 కోట్ల స్కామ్ వెలికితీత

MHలో Dy.CM అజిత్ పవార్ కుమారుడు పార్థ్ కంపెనీకి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం తీవ్రవివాదంగా మారింది. ₹1800CR విలువైన భూమిని ₹300CRకే కట్టబెట్టారు. ఈ స్కామ్‌పై ముందుగా దిన్‌కర్ కోట్కర్(60) IGR ఆఫీసుకు లేఖ రాసినా స్పందన రాలేదు. ఆ లేఖను తీసుకున్న ఓ సోషల్ యాక్టివిస్టు రికార్డులు టాంపర్ చేసినట్లు బయటపెట్టారు. అధికారుల విచారణలో అక్రమాలు నిజమని తేలడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.
News November 8, 2025
తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తాంసి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.


