News March 22, 2025

ఆ రైతులకు పరిహారం చెల్లించాలి: బండి

image

TG: గత పదేళ్లలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనూ ఆదుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే సర్వే చేసి వారం రోజుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. మరోవైపు ప్రజల దృష్టి మరల్చేందుకు డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ఫైరయ్యారు.

Similar News

News March 24, 2025

బంగారం ధరపై బిగ్ హింట్ ఇచ్చిన ఇండస్ట్రియలిస్ట్

image

GOLD ధర మున్ముందు మరింత పెరగొచ్చని వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ అంచనా వేశారు. ‘గ్లోబల్ ఎకానమీ అనిశ్చితిలో పడ్డ ప్రతిసారీ బంగారం ధర రికార్డు గరిష్ఠాలకు చేరడాన్ని మనం చూశాం. సురక్షితమైన పెట్టుబడిగా ఇది మరింత మెరవనుంది. ఔన్స్ $3000 దాటడంతో ఇంకా పెరుగుతుందని నిపుణుల అంచనా. భారత్ వద్ద ఇప్పటికే ఉన్న గోల్డ్ అసెట్స్‌ను రివైవ్, రీవైటలైజ్ చేయడానికి ఇదే సరైన టైమ్. అవకాశాన్ని వాడుకోవాలి’ అని అన్నారు.

News March 24, 2025

అతడు అడిగితే తప్ప సాయం చేయను: ధోనీ

image

CSK కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా పనిచేస్తున్నారని ఆ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ కొనియాడారు. ‘రుతురాజ్ నన్ను అడిగితే తప్ప నేను సాయం చేయను. మైదానంలో ప్రతి నిర్ణయం అతడిదే. ఒకవేళ నేను ఏదైనా సలహా చెప్పినా అది కచ్చితంగా అనుసరించాలని అనుకోవద్దని తనకి ముందే చెప్పాను. కెప్టెన్‌గా రుతు ఉన్నా నిర్ణయాలు నేనే తీసుకుంటాననుకుంటారు చాలామంది. అందులో ఏమాత్రం నిజం లేదు’ అని స్పష్టం చేశారు.

News March 24, 2025

గుంటూరు CID కార్యాలయానికి పోసాని

image

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇవాళ గుంటూరులోని CID ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల బెయిల్ ఇచ్చిన సమయంలో సీఐడీ కేసుకు సంబంధించి వారంలో 2 రోజులు కార్యాలయానికి వెళ్లాలని కోర్టు ఆదేశించింది. సోమ, గురువారం కార్యాలయంలో సంతకాలు చేయాలని పేర్కొన్న విషయం తెలిసిందే. CIDతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదై రిమాండులో ఉండగా, ఒక్కొక్కటిగా బెయిల్ రావడంతో పోసాని 2 రోజుల కిందట రిలీజ్ అయ్యారు.

error: Content is protected !!