News March 22, 2025
రేపు, ఎల్లుండి వర్షాలు

TG: నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఇవాళ బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈరోజు రాత్రి వరకు కొన్ని చోట్ల వాన పడుతుందని పేర్కొంది.
Similar News
News March 24, 2025
బంగారం ధరపై బిగ్ హింట్ ఇచ్చిన ఇండస్ట్రియలిస్ట్

GOLD ధర మున్ముందు మరింత పెరగొచ్చని వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ అంచనా వేశారు. ‘గ్లోబల్ ఎకానమీ అనిశ్చితిలో పడ్డ ప్రతిసారీ బంగారం ధర రికార్డు గరిష్ఠాలకు చేరడాన్ని మనం చూశాం. సురక్షితమైన పెట్టుబడిగా ఇది మరింత మెరవనుంది. ఔన్స్ $3000 దాటడంతో ఇంకా పెరుగుతుందని నిపుణుల అంచనా. భారత్ వద్ద ఇప్పటికే ఉన్న గోల్డ్ అసెట్స్‌ను రివైవ్, రీవైటలైజ్ చేయడానికి ఇదే సరైన టైమ్. అవకాశాన్ని వాడుకోవాలి’ అని అన్నారు.
News March 24, 2025
అతడు అడిగితే తప్ప సాయం చేయను: ధోనీ

CSK కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా పనిచేస్తున్నారని ఆ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ కొనియాడారు. ‘రుతురాజ్ నన్ను అడిగితే తప్ప నేను సాయం చేయను. మైదానంలో ప్రతి నిర్ణయం అతడిదే. ఒకవేళ నేను ఏదైనా సలహా చెప్పినా అది కచ్చితంగా అనుసరించాలని అనుకోవద్దని తనకి ముందే చెప్పాను. కెప్టెన్‌గా రుతు ఉన్నా నిర్ణయాలు నేనే తీసుకుంటాననుకుంటారు చాలామంది. అందులో ఏమాత్రం నిజం లేదు’ అని స్పష్టం చేశారు.
News March 24, 2025
గుంటూరు CID కార్యాలయానికి పోసాని

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇవాళ గుంటూరులోని CID ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల బెయిల్ ఇచ్చిన సమయంలో సీఐడీ కేసుకు సంబంధించి వారంలో 2 రోజులు కార్యాలయానికి వెళ్లాలని కోర్టు ఆదేశించింది. సోమ, గురువారం కార్యాలయంలో సంతకాలు చేయాలని పేర్కొన్న విషయం తెలిసిందే. CIDతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదై రిమాండులో ఉండగా, ఒక్కొక్కటిగా బెయిల్ రావడంతో పోసాని 2 రోజుల కిందట రిలీజ్ అయ్యారు.