News March 22, 2025
ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు 38 కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 1,337 మందికి గాను 1,335 మంది హాజరయ్యారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 8 మందికి గాను ముగ్గురు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 1,345 మందికి గాను 1,338 మంది పరీక్షలకు హాజరు కాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News November 5, 2025
PNBలో 750 ఉద్యోగాలకు నోటిఫికేషన్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 750 పోస్టులకు 20-30 ఏళ్ల మధ్య ఉన్న గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ నవంబర్ 23. ఇక్కడ <
News November 5, 2025
కరీంనగర్: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

KNR జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీలో పురుషుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాలున్న పురుషులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు Nov9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు తమను సంప్రదించవచ్చన్నారు. SHARE IT.
News November 5, 2025
రజినీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్!

మరోసారి రజినీకాంత్-కమల్ హాసన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో ఈ మూవీ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రజినీ తన తర్వాతి రెండు మూవీస్ కమల్ ప్రొడక్షన్‌లోనే చేయబోతున్నారట. మొదటిది సుందర్ సి దర్శకత్వంలో, రెండోది నెల్సన్ డైరెక్షన్‌లో ఈ మల్టీస్టారర్ ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.


