News March 22, 2025
గుంటూరు జిల్లాలో ఉగాది పురస్కారాలు వీరికే..

గుంటూరు జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన పలువురికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు అందజేయనుంది. వారిలో తాడేపల్లి సిఐడి అడిషనల్ ఎస్పీ జయరామరాజు మహోన్నత సేవా పతాకం అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ సేవా పురస్కారానికి హెడ్ కానిస్టేబుల్ పిచ్చయ్య, APSP 6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ హనుమంతు, ARSI ఉదయ కుమార్, PCలు శివప్రసాద్, విరుపాక్ష ఎంపికయ్యారు. తెనాలి ఎస్ఐ శ్రీనివాసరావుకు సేవా పురస్కారం వరించింది.
Similar News
News March 25, 2025
తాడేపల్లిలో వివాహిత దారుణ హత్య (అప్డేట్)

తాడేపల్లిలో ఆదివారం రాత్రి నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసినదే. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. లక్ష్మీ తిరుపతమ్మతో సన్నిహితంగా ఉండే బిహార్‌కు చెందిన కార్మికులు హత్య చేసినట్లు ఆమె సోదరుడు ఆరోపించాడు. పోలీసులు లక్ష్మీ తిరుపతమ్మ స్నేహితురాలిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News March 25, 2025
మంగళగిరి: ప్రజా క్షేత్రంలో కనిపించని ఆర్కే

మంగళగిరి మాజీ ఎమ్మెల్యే YCP నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) 10 ఏళ్ల పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి RK నియోజకవర్గంలో అందుబాటులో లేరు. కనీసం కార్యకర్తలకు, అనుచరులకు సైతం కనిపించకపోవడం వారిని నిరుత్సాహానికి గురి చేస్తోంది. చివరి ఎన్నికల్లో YCP తరపున పోటీ చేసిన మురుగుడు లావణ్య, కాండ్రు కమల ప్రజా క్షేత్రంలో కనిపించకపోవడం గమనార్హం.
News March 24, 2025
ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చి దిద్దాలి: లోకేశ్

ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం మంత్రి లోకేశ్ సమక్షంలో GNU, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్నారు.