News March 22, 2025

అమలాపురం: మానవాళి మనుగడుకు నీరే ప్రాణాధారం

image

మానవాళి మనుగడకు నీరే ప్రాణాధారమని,జల భద్రతతోనే భవిత సురక్షితమనికలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని నాబార్డ్ కోనసీమ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జల సంరక్షణపై దిశా నిర్దేశం చేస్తూ భవిష్యత్తులోఎదుర్కొనబోయే నీటి యాజమాన్య సవాళ్లను గురించి తెలియజేశారు. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకొవాలన్నారు.

Similar News

News July 7, 2025

యాదాద్రి: మహిళలకు అబార్షన్.. పోలీసుల అదుపులో వైద్యుడు

image

భువనగిరి గాయత్రి ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసిన ఓ డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు SI కుమారస్వామి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి హాస్పిటల్‌కు వెళ్లి తనిఖీ చేయగా మహిళలకు అబార్షన్ చేసి అబ్జర్వేషన్‌లో ఉంచగా, డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్కానింగ్ చేసిన మరో డాక్టర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. మహిళలు ఇద్దరు యాదాద్రి జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది.

News July 7, 2025

KU పరిధిలో 2,356 సీట్లు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 2,356 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని రెండు కాలేజీల్లో 780 సీట్లు ఉండగా.. నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 1,576 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,103 సీట్లను భర్తీ చేయనున్నారు. టీజీఎప్‌సెట్-2025 ఫస్ట్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 8 వరకు అవకాశం ఉండగా.. వెబ్ ఆప్షన్లకు 10 వరకు గడువు ఉంది.

News July 7, 2025

20 నుంచి కడపలో రక్తదాన శిబిరాలు

image

రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణ పోయవచ్చని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రం, మై భారత్ ఆధ్వర్యంలో రక్తదాన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కడపలోని రెడ్‌క్రాస్ కార్యాలయం, రిమ్స్ ఆసుపత్రి, ప్రభుత్వ కాలేజీ ప్రాంగణాల్లో జులై 20 నుంచి 26వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు రక్తదానం చేయాలని కోరారు.