News March 22, 2025

ఎన్నికలు వస్తే MPగా పోటీ చేస్తా: మల్లారెడ్డి

image

మేడ్చల్ జిల్లా అభివృద్ధి, మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల విషయంలో CM రేవంత్ రెడ్డిని కలిసినట్లు మేడ్చల్ MLA మల్లారెడ్డి తెలిపారు. 72ఏళ్ల వయసులో నేనెందుకు పార్టీ మారతాను. కాంగ్రెస్‌లోకి వెళ్లిన MLAలే పరేషాన్‌లో ఉన్నారు. BRS నుంచి పోటీకి మా కుటుంబం నుంచి నలుగురు సిద్ధంగా ఉన్నారు. జమిలి ఎన్నికలు వస్తే MPగా పోటీ చేస్తానని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

Similar News

News July 7, 2025

శ్రీకాకుళం IIITలో 149 సీట్లు ఖాళీ

image

శ్రీకాకుళం IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 867 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 149 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11,12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.

News July 7, 2025

‘అనకాపల్లి జిల్లాలో కల్తీ మద్యం.. ఇద్దరు అరెస్ట్’

image

కల్తీ మద్యం తయారు చేస్తూ ఈనెల రెండవ తేదీన పట్టుబడిన నిందితులు రుత్తల రాము, ఎలమంచిలి వెంకటేశ్వరరావును రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. ఆదివారం అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వీరిద్దరూ కల్తీ మద్యం వ్యాపారాన్ని రెండున్నర ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల వెనుక టీడీపీ నేత ఉన్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

News July 7, 2025

నెల్లూరుకు చేరుకున్న మంత్రి లోకేశ్

image

నెల్లూరు పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు బొకే అందించి ఆహ్వానం పలికారు. ఈ మేరకు మంత్రి ఇవాళ VR స్కూల్ ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.