News March 22, 2025

సీసీ రోడ్ల నిర్మాణంలో కర్నూలు జిల్లా నం.1: పవన్ కళ్యాణ్

image

సీసీ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఓర్వకల్లు మం. పూడిచెర్ల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తెలిపారు. జిల్లాలో రూ.75 కోట్లతో 117 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణం పూర్తయిందని, దీనికి కలెక్టర్ రంజిత్ బాషాకు అభినందనలు తెలిపారు. అందుకే పూడిచెర్లలో నీటి కుంటల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

Similar News

News January 14, 2026

HYD: నగర శివారులో నయా పార్క్

image

నగరవాసులకు మరో ఆకర్షణీయమైన ఉద్యానవనం అందుబాటులోకి రానుంది. TG సాంస్కృతిక సంపద, కళాత్మక వైభవం ఉట్టిపడేలా శివారు తెల్లాపూర్‌లో ‘తెలంగాణ ట్రిబ్యూట్ గార్డెన్’ను అభివృద్ధి చేయడానికి HMDA కంకణం కట్టింది. 10 ఎకరాల్లో రూ.48 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కృష్ణా-గోదావరి వాటర్వేస్‌, కాకతీయ శిల్పకళతో పర్యాటక ఆకర్షణగా పార్కును తీర్చిదిద్దనున్నారు. ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు ప్రారంభంకానున్నాయి.

News January 14, 2026

గద్వాల: మున్సిపాలిటీల తుది ఓటర్ జాబితా విడుదల

image

గద్వాల జిల్లాలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అధికారులు తుది ఓటర్ జాబితాను నేడు విడుదల చేశారు. అలంపూర్‌లో 10 వార్డుల్లో పురుషులు-4681 మహిళాలు-4940, ఇతరులు ఒకరు ఉన్నారు. గద్వాల్‌లో 37 వార్డులలో మొత్తం 65282 ఉండగా పురుషులు-31684, మహిళాలు-33558, ఇతరులు 10 మంది ఉన్నారు. ఐజలో 20 వార్డులలో మొత్తం 23016 ఉండగా పురుషులు-11230, మహిళా-11786 ఉండగా.. వడ్డేపల్లిలో 5256 పురుషులు, 5347 మహిళాలున్నారు.

News January 14, 2026

సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేయాలి?

image

సంక్రాంతికి వేసే ‘రంగవల్లి’ అంటే రంగుల వరుస అని అర్థం. ఇంటి ముంగిట ముగ్గు వేయడం లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడమే కాదు, బియ్యప్పిండితో వేయడం వల్ల మూగజీవాలకు ఆహారం కూడా లభిస్తుంది. ముగ్గుల్లోని జ్యామితీయ ఆకృతులు చూసేవారి మనసుకు ప్రశాంతతను ఇస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. వంగి ముగ్గులు వేయడం మహిళలకు మంచి వ్యాయామం. ముగ్గుల్లో వాడే రంగులు సంపదకు, బలానికి సంకేతాలుగా నిలుస్తూ, ఇంటికి శుభాలు చేకూరుస్తాయి.