News March 22, 2025

కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?

image

శీతల పానీయాల్లో మైక్రోప్టాస్టిక్‌లు ఉన్నట్లు థాయిలాండ్‌లో నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్యాకేజీతో సంబంధం లేకుండా మొత్తం 9 బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్‌ గుర్తించారు. ఏడాదికి ఓ వ్యక్తి సగటున 41.13 లీటర్ల కూల్‌డ్రింక్స్ తాగుతున్నట్లు గుర్తించారు. కూల్‌డ్రింక్స్ జీవక్రియ, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. మైక్రోప్లాస్టిక్ శరీరంపై చూపే ప్రతికూల ప్రభావాల గురించి మరింత పరిశోధనలు చేయనున్నారు.

Similar News

News March 25, 2025

పార్కింగ్ ఫీజు రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

image

AP: వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల వద్ద తొలి 30min వరకు ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయవద్దని మున్సిపల్ శాఖ ఆదేశాలిచ్చింది. వస్తువులు కొన్న బిల్స్ చూపిస్తే 30min నుంచి 1hr వరకు ఫీజు తీసుకోవద్దని సూచించింది. సినిమా టికెట్ లేదా ఆ సముదాయంలో పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ మొత్తం విలువైన వస్తువులు కొంటే గంట కంటే ఎక్కువసేపు ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ ఆదేశాలు APR 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

News March 25, 2025

వాట్సాప్‌లో సూపర్ ఫీచర్

image

వాట్సాప్‌లో త్వరలో ‘Spotify Music-status updates’ ఫీచర్ రానుంది. దీని సాయంతో యూజర్లు Spotify మ్యూజిక్ ప్లాట్‌ఫామ్ నుంచి తమకు ఇష్టమైన పాటలను వాట్సాప్ స్టేటస్‌లుగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇతర యూజర్లు కూడా ఆ స్టేటస్‌పై సింగల్ ట్యాప్‌తో Spotifyలో ఆ సాంగ్‌ను వినేందుకు వీలుంటుంది. యాప్‌లో స్టేటస్ ఆప్షన్ వద్దే నేరుగా మ్యూజిక్ యాడ్ చేసేలా ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది.

News March 25, 2025

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్

image

AP: గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి ఆప్షన్ల మార్పునకు APPSC మరో అవకాశం కల్పించింది. ఈనెల 26 నుంచి ఏప్రిల్ 2 వరకు అభ్యర్థులు తమ మాధ్యమం, పోస్టులు, జోనల్ ప్రాధాన్యం, ఎగ్జామ్ సెంటర్ల మార్పు చేర్పులు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు మొత్తం 7 పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి.

error: Content is protected !!