News March 22, 2025
NRPT: 18 మంది గైర్హాజరయ్యారు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శనివారం రెండో రోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 39 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 7,635 మందికి ఇందులో 8 మంది విద్యార్థులు మినహాయింపు ఇవ్వగా 7,609 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 18 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షలకు గైర్హాజరైనట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీ జరిపారు.
Similar News
News November 18, 2025
ఆరుట్ల బుగ్గ జాతర 40 వేల మంది భక్తులు

కార్తీక చివరి సోమవారం భక్తులు ఆరుట్ల బుగ్గ జాతరకు పోటెత్తారు. మహిళలు భారీ సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు ఆచరించేందుకు మక్కువ చూపారు. నీళ్లలో దీపాలను వెలిగించి శివయ్యను కొలిచారు. దాదాపు సోమవారం ఒక్కరోజే 40 వేల మంది భక్తలు ఆలయానికి వచ్చినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గురువారం చివరి రోజు కావడంతో ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బుగ్గ జాతరకు మీరూ వెళ్తున్నారా?

ఆదిలాబాద్: నేటి నుంచి KU డిగ్రీ పరీక్షలు ప్రారంభం

కాకతీయ యూనివర్సిటీ (KU) పరిధిలో 1, 3, 5 సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 5వ సెమిస్టర్ పరీక్షలు ఈరోజు నుంచి 1వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.