News March 22, 2025
కేకేఆర్ టీమ్‌కు షారుఖ్ ఖాన్ సందేశం

ఈరోజు తొలిమ్యాచ్ ఆడనున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ KKRకు ఆ జట్టు యజమాని షారుఖ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ‘మీ అందరిపై దేవుడి కరుణ ఉండాలి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని చక్కగా చూసుకుంటున్న చంద్రకాంత్ గారికి థాంక్స్. కొత్తగా జట్టులో చేరిన వారికి వెల్కమ్. ఈ సీజన్లో మనల్ని నడిపించనున్న అజింక్యకు ధన్యవాదాలు. మీ అందరికీ ఈ టీమ్ ఇల్లులా మారుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.
Similar News
News March 25, 2025
తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంతంటే?

తెలంగాణకు ₹4,42,298 కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్రం లోక్ సభలో వెల్లడించింది. ఈ విషయంలో దేశంలో TG 24వ స్థానంలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలాగే రాష్ట్రంలో గత 6 ఏళ్లలో 10,189 IT కంపెనీలు ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా తెలిపారు. ఇదే సమయంలో 3,369 సంస్థలు మూతపడ్డాయని పేర్కొన్నారు. ఈ కంపెనీల ద్వారా గత ఐదేళ్లలో ₹14,865కోట్ల టర్నోవర్ జరిగిందని వివరించారు.
News March 25, 2025
ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలేను భారతరత్నతో సత్కరించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా CM ఫడణవీస్ మాట్లాడుతూ ‘మహాత్మా బిరుదు దేశంలో అన్నింటికన్నా గొప్పది. దీనిని ప్రజలు ఫూలే, గాంధీకి మాత్రమే ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ఫూలే దంపతులు 19వ శతాబ్దంలో బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
News March 25, 2025
నేడు, రేపు సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు CCLA ప్రారంభ ఉపన్యాసం, ఆ తర్వాత CS, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం కలెక్టర్ల సమావేశంపై సీఎం ప్రసంగిస్తారు. నేడు వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.