News March 22, 2025
BREAKING: 357 బెట్టింగ్ సైట్స్ బ్లాక్

పన్ను ఎగ్గొడుతున్న ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌లపై కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన DGGI కొరడా ఝుళిపించింది. 357 వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. ఆయా సంస్థలకు చెందిన 2,400 అకౌంట్లలోని రూ.126 కోట్లను సీజ్ చేసింది. దాదాపు 700 విదేశీ సంస్థలు ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్/గ్యాంబ్లింగ్ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News March 26, 2025
బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేట్ల తగ్గింపు!

బ్యాంకులు APR నుంచి డిపాజిట్ వడ్డీరేట్లను తగ్గించొచ్చని సమాచారం. క్రెడిట్ డిమాండ్ సులభతరం కావడం, RBI మళ్లీ వడ్డీరేట్లను కత్తిరించే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని విశ్లేషకుల అంచనా. FEBలో 25BPS మేర కత్తిరించినప్పటికీ అత్యధిక డిపాజిటర్లు వెళ్లిపోతారేమోనన్న ఆందోళనతో బ్యాంకులు వడ్డీని తగ్గించలేదు. తాజాగా ద్రవ్యోల్బణం 3.6%కు చేరడం, RBI మానిటరీ పాలసీ సమావేశం సమీపిస్తుండటంతో ఇక కోత తప్పదని తెలుస్తోంది.
News March 26, 2025
ఉప్పల్‌లో IPL మ్యాచ్‌లు.. TGSRTC స్పెషల్ బస్సులు

TG: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు వెళ్లే అభిమానులకు TGSRTC శుభవార్త చెప్పింది. GHMC పరిధిలోని 24 డిపోల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. మార్చి 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో ఉప్పల్‌లో మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే.
News March 26, 2025
ఇఫ్తార్ విందును బహిష్కరించాలని పిలుపు

AP: రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరించాలని పలు ముస్లిం సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయానికి వచ్చాయి. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యులు డిమాండ్ చేశారు. రేపు ఇఫ్తార్ విందును బహిష్కరించడమే కాకుండా ఈ నెల 29న ధర్నా చౌక్‌లో భారీ నిరసనకు పిలుపునిచ్చారు.