News March 22, 2025

విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

image

AP: విశాఖ మేయర్ వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలుగా కూటమి నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో YCPకి షాక్ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. GVMCలో 98 స్థానాలుండగా, YCP 59 చోట్ల గెలిచింది. ఈ 9 నెలల్లో 28 మంది కూటమి పార్టీల్లో చేరడంతో YCP బలం పడిపోయింది. మేయర్‌కు నాలుగేళ్ల పదవీకాలం పూర్తవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానానికి మార్గం సుగమమైంది.

Similar News

News September 17, 2025

రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మిరాయ్’

image

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. మొదటి 4 రోజుల్లో రూ.91.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించగా విశ్వ ప్రసాద్ నిర్మించారు.

News September 17, 2025

ఇప్పటికే అనేక రంగాల్లో GST ప్రయోజనాలు: నిర్మల

image

AP: 140కోట్ల మందికి వర్తించే GSTపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. GST కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే అనేక రంగాలు ప్రయోజనాలు పొందుతున్నాయని విశాఖలో GST సంస్కరణల సమావేశంలో తెలిపారు. ‘12శ్లాబ్‌లో ఉండే 99శాతం వస్తువులు 5% GST పరిధిలోకి తెచ్చాం. 28 శ్లాబ్‌లో ఉండే వస్తువులు దాదాపు 90శాతం 18% పరిధిలోకి వచ్చేశాయి’ అని వివరించారు.

News September 17, 2025

విలీనం కాకపోతే TG మరో పాక్‌లా మారేది: బండి

image

TG: సర్దార్ వల్లభాయ్ పటేల్‌ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘భారత్‌లో TG విలీనం కాకుంటే మరో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లా ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది. జలియన్ వాలాబాగ్‌ను మించి పరకాల, బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపాతం సృష్టించారు. ఈ దురాగతాలను చరిత్రకారులు విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలను నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.