News March 22, 2025
BHPL: పుష్కరాల ఏర్పాట్లపై మొబైల్ యాప్.. పరిశీలించిన కలెక్టర్

పుష్కరాల్లో చేసిన ఏర్పాట్ల సమాచారం భక్తులకు ఉపయోగపడేలా మొబైల్ యాప్ తయారు చేయు అంశాలను భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. మొబైల్ యాప్‌లో సమగ్ర సమాచారం ఉండాలని అధికారులకు సూచించారు. టెంట్ సిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రధాన కూడళ్లలో తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సూచించారు. ప్రవేశ మార్గాలు, రోడ్లు మరమ్మతులు, మెరుగుదల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
Similar News
News March 25, 2025
సూర్యాపేట: CM రేవంత్ రాక.. సభా ఏర్పాట్ల పరిశీలన

CM రేవంత్ ఈ నెల 30 ఉగాదిన సూర్యాపేట జిల్లా HNRకు రానున్నారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇచ్చే పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
News March 25, 2025
జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే: భారత ప్రతినిధి

జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని భారత శాశ్వత ప్రతినిధి తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలను భారత్‌కు వెంటనే అప్పగించాలని స్పష్టం చేశారు. UNOలో పాక్ అనవసరంగా జమ్మూకశ్మీర్ ప్రస్తావన తీసుకొస్తోందని, ఎన్ని అవాస్తవాలు చెప్పినా ఆ ప్రాంతం భారత్‌కే చెందుతుందని అన్నారు. UNO శాంతి పరిరక్షణ చర్చలో జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రతినిధి లేవనెత్తగా భారత్ దీటుగా బదులిచ్చింది.
News March 25, 2025
జమ్మిచేడు జమ్ములమ్మకు విశేష పూజలు

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు మంగళవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకుడు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళవారం సందర్భంగా జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.