News March 22, 2025
ఎంఎంటీఎస్ కోసం వేయికళ్లతో ఎదురుచూపు..!

వికారాబాద్ జిల్లా ప్రజలు MMTS రైలు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు జిల్లా నుంచి సుమారుగా 10 – 12 వేల మంది ప్రయాణికులు HYDకు వెళ్లి వస్తున్నారు. కొన్నేళ్లుగా VKB రైల్వే స్టేషన్ జంక్షన్‌గా కొనసాగుతుంది. కాగా MMTS సర్వీస్ ప్రస్తుతం లింగంపల్లి వరకే ఉంది. కావున MMTS సర్వీస్‌ను VKB వరకు పొడిగిస్తే జిల్లా ప్రజలకు ఎంతగానో మేలవుతుంది. ప్రభుత్వం ఇందుకు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
Similar News
News March 25, 2025
కేబినెట్ విస్తరణ.. హైదరాబాద్‌కు NO ఛాన్స్..!

మంత్రి వర్గ విస్తరణలో HYD, ఉమ్మడి RRకు చెందిన ఒక్క కాంగ్రెస్ MLAకు ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశం కొలిక్కి వచ్చింది. శ్రీగణేశ్ (కంటోన్మెంట్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), రామ్మోహన్ రెడ్డి(పరిగి), మనోహర్ రెడ్డి (తాండూర్), ఆరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలే యాదయ్య (చేవెళ్ల) ఉండగా ఎవరికీ ఛాన్స్ దక్కలేదని సమాచారం.

భూపాలపల్లి: 31 వరకు ఛాన్స్.. 25 శాతం రాయితీ

లే అవుట్ క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా ఈ నెలాఖరు వరకు ఫీజు చెల్లింపులో ప్రభుత్వం 25 శాతం రాయితీ అవకాశం కల్పించిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్లాట్ కొనుగోలుదారులకు ఈ రాయితీని మార్చి 31 వరకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.