News March 22, 2025
కాగజ్‌నగర్: 3 ఇళ్లల్లో చోరీ.. నిందితుడు అరెస్ట్

3 ఇళ్లలో చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణంలోని బాలాజీ నగర్‌లో కొద్ది రోజుల క్రితం 3 ఇళ్లలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా ప్రదీప్ అనే నిందితుడుని పట్టుకున్నామన్నారు. అతడి వద్ద 86.6 గ్రా. బంగారు ఆభరణాలు, కారు, సెల్ ఫోన్, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News March 25, 2025
పెరవలి : చికెన్ కోసం వెళ్లి ఇద్దరు మృతి

అన్నవరప్పాడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టి , పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హనుమంతు కూడా కన్నుమూశాడు. అయితే వారు ఇరువురూ చికెన్ కోసం అన్నవరప్పాడుకు వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనపై ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
News March 25, 2025
జనగామ: ‘ఎల్ఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

జనగామ పట్టణ పరిధిలో ఉన్న ఫ్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)ను ఈ నెల 31 వరకు చేసుకునే అవకాశం ఉందని జిల్లా అధికారులు తెలిపారు. 25% డిస్కౌంట్‌తో ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని పట్టణ వాసులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మళ్లీ క్రమబద్ధీకరణ తేదీని పెంచే అవకాశం లేదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
News March 25, 2025
విశాఖలో 15 మందిపై పీడీ యాక్ట్..!

విశాఖ సిటీలో రౌడీ షీటర్ల ఆగడాలు నివారించేందుకు విశాఖ సీపీ కఠిన చర్యలు చేపడుతున్నారు. అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారి వివరాలు సేకరిస్తూనే పలువురుపై పీడీ యాక్ట్ పెడుతున్నారు. తాజాగా సీతంపేట, కొబ్బరితోట ప్రాంతాలకు చెందిన వై.కుమార్, వై.ఎర్రన్నలపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే 13 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయగా.. వీరిద్దరితో ఆ సంఖ్య 15కు చేరింది.