News March 22, 2025
BREAKING: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

TG: ఏపీలో పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని BRS అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తాము సింగిల్‌గానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. కార్యకర్తలంతా ఒక్కో కేసీఆర్‌లా తయారవ్వాలి. మోదీ నా మెడపై కత్తిపెట్టినా నేను రాష్ట్రం కోసం వెనకడుగు వేయలేదు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే’ అని పేర్కొన్నారు.
Similar News
News March 25, 2025
ఢిల్లీ గెలుపుపై కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

లక్నోపై విజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత నిద్రలోంచి మేల్కొంటే పొందే అనుభవం అద్భుతం. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మ్యాచ్. ఢిల్లీ జట్టు పోరాడుతూనే ఉంటుంది. మన గోల్‌ను చేరుకునేందుకు బ్యాట్, బాల్, ఫీల్డ్‌లో మనం చాలా మెరుగుపరుచుకోవాలని నాకు తెలుసు. దయచేసి మాతో ప్రయాణాన్ని ఆస్వాదించండి’ అని కెవిన్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
News March 25, 2025
జస్టిస్ వర్మ నగదు ఘటన: ఎంపీలతో ధన్‌ఖడ్ కీలక సమావేశం

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సాయంత్రం 4:30కు ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు కాలిపోవడం, ఆయనపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపక్ష ఎంపీల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అలాగే NJACని అమల్లోకి తీసుకురావడంపై చర్చిస్తారని సమాచారం. నిన్న BJP, కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేతో ధన్‌ఖడ్ ప్రత్యేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.
News March 25, 2025
ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్నందుకే నాపై కేసులు: కాకాణి

AP: కూటమి ప్రభుత్వం తనపై కావాలనే అక్రమ కేసులు పెడుతుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ఆరోపించారు. ‘గతంలో అక్రమాలు జరగలేదని మైనింగ్ అధికారి రిపోర్టు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అక్రమ మైనింగ్ అంటూ కేసు పెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే నాపై కేసులు పెడుతున్నారు. వాటికి భయపడేది లేదు. అక్రమ కేసులపై కోర్టులను ఆశ్రయిస్తా. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి’ అని ఆయన అన్నారు.