News March 22, 2025
టెన్త్ పేపర్ లీక్: ఇద్దరు ఆఫీసర్ల సస్పెన్షన్

TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని SLBC బాలికల గురుకుల పాఠశాలలో తెలుగు పేపర్ లీక్ ఘటనకు బాధ్యులైన అధికారులపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంది. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. అలాగే పేపర్ లీకేజీకి సహకరించిన విద్యార్థినిని కూడా డిబార్ చేసింది. కాగా నిన్న తెలుగు ప్రశ్నాపత్రానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
Similar News
News March 25, 2025
ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్

ఎల్లుండి ఉప్పల్‌లో లక్నోతో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ప్రత్యక్షంగా హాజరయ్యే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ప్రారంభానికి ముందు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సంగీత కార్యక్రమంతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఐపీఎల్ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఐపీఎల్ జరుగుతున్న పలు స్టేడియాల్లో మ్యాచ్‌కు ఇదే తరహాలో మ్యూజికల్ ఈవెంట్స్‌ను బీసీసీఐ నిర్వహిస్తోంది.
News March 25, 2025
దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

విదేశీ పెట్టుబడుల వెల్లువ, అమెరికా మార్కెట్ల ర్యాలీ దృష్ట్యా భారత మదుపర్ల సానుకూల సెంటిమెంట్‌తో సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్తున్నాయి. 30 షేర్ BSE బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 418.54 పాయింట్లు లాభపడి 78,402.92కు చేరుకుంది. ఇక NSE నిఫ్టీ 107.85 పాయింట్లు పెరిగి 23,766.20 వద్ద ఉంది. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, HCL టెక్, TCS, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్రా, మారుతి బాగా లాభపడ్డాయి.
News March 25, 2025
ఏప్రిల్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: చంద్రబాబు

AP: ఏప్రిల్ మొదటివారంలో DSC నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్కూళ్ల ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ భర్తీ చేస్తాం. 2027నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతాం. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్‌తో అమరావతిని అభివృద్ధి చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.